డైలాగ్ కింగ్ సాయి కుమార్ తన రాబోతున్న కన్నడ చిత్రం “కల్పన”లో హిజ్రా పాత్రలో కనిపించనున్నారు. సాయి కుమార్ కి మంచి పేరు సంపాదించిపెట్టిన “పోలీసు స్టొరీ” చిత్రం ముందు కన్నడ లో తెరకెక్కింది.ఈ రకమయిన పాత్ర చెయ్యడం సాయి కుమార్ కి ఇదే మొదటి సారి. ఈ చిత్రంలో హీరోగా ఉపేంద్ర నటిస్తున్నారు. ఈ చిత్రం రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన “కాంచన” చిత్రానికి రీమేక్. ఈ చిత్రంలో శరత్ కుమార్ హిజ్ర పాత్రను పోషించారు. కన్నడ వెర్షన్ లోను కథానాయికగా లక్ష్మీ రాయ్
నటించనుంది. రామ్ నారాయణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా వి హరికృష్ణ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు ఈ చిత్రంలో చాలా వరకు చిత్రీకరణ పూర్తి అయిపోయింది ఈ ఏడాదే ఈ చిత్రం విడుదల కానుంది తెలుగులో సాదించిన విధంగానే ఈ చిత్రం కన్నడలో కూడా భారీ విజయం సాదిస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిన విషయం.