టాలీవుడ్ సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి గారి అమ్మగారు శ్రీమతి రాజనందిని గారు స్వర్గస్తులైనారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో భాధపడుతున్న ఆమె ఈ రోజు ఉదయం కన్నుమూసారు. భర్త విజయేంద్ర ప్రసాద్ మరియు అతని కుటుంబంతోనే ఆమె ప్రస్థానం కూడా సాగింది. శ్రీమతి రాజనందిని గారి గురించి మరింత సమాచారం లేదు, ఎందుకంటే ఆమె ఎప్పుడూ అంత పబ్లిక్ గా ఫంక్షన్లకి రాలేదు మరియు ఆమె మీడియాకి దూరంగా ఉంటారు. రాజమౌళి గారి ఫ్యామిలీ ఇండస్ట్రీలోని అందరికీ సుపరిచితులే కావడంతో ఉదయం నుంచి ఇండస్ట్రీలోని ప్రముఖులు అంతా వారి కుటుంబానికి తీవ్ర సంతాపాన్ని తెలియజేసారు.
డైరెక్టర్ రాజమౌళి మరియు అతని కుటుంబానికి 123తెలుగు.కామ్ తరపున తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నాం.