ఇక నుంచి దీనిపై దృష్టి పెట్టనున్న “RRR” యూనిట్.!

ఇక నుంచి దీనిపై దృష్టి పెట్టనున్న “RRR” యూనిట్.!

Published on Jan 31, 2021 6:18 PM IST


ఇప్పుడు మన టాలీవుడ్ నుంచి రాబోతున్న భారీ పాన్ ఇండియన్ చిత్రాల్లో దర్శక ధీరుడు రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో తీస్తున్న చిత్రం “రౌద్రం రణం రుధిరం” కూడా ఒకటి. మరి ఈ చిత్రం తాలూకా రిలీజ్ డేట్ తోనే మన తెలుగు సహా మిగతా భాషల్లో కూడా భారీ చిత్రాల తాలూకా విడుదల తేదీలను ప్రకటించడం స్టార్ట్ అయ్యింది.

మరి ఇక్కడ నుంచి ఈ చిత్ర యూనిట్ షూటింగ్ తో పాటుగా మరో అసలు పనిని కూడా స్టార్ట్ చెయ్యడానికి రెడీ అవుతున్నారు. అదే సినిమా ప్రమోషన్స్..దర్శకుడు రాజమౌళి ప్రమోషన్స్ ఏ లెవెల్లో ప్లాన్ చేస్తారో తెలిసిందే. ఇంతకు ముందు బాహుబలి రెండు సినిమాలకు కూడా న్నీ భాషల్లోనూ నెవర్ బిఫోర్ ప్రమోషన్స్ చేశారు. మరి ఈ చిత్రానికి అంతకు మించే ఉండడం ఖాయం. ప్రస్తుతానికి అయితే మేకర్స్ దీనిపై కూడా దృష్టి పెట్టడం స్టార్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ భారీ చిత్రానికి ఏ సరికొత్త ప్లానింగ్స్ తో జక్కన వస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు