డా. మోహన్ బాబు, మంచు విష్ణు హీరోలుగా విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘రౌడీ’. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా విజయంపై మంచు విష్ణు చాలా నమ్మకంగా ఉన్నాడు.
మంచు విష్ణు మాట్లాడుతూ ‘సినిమా ఫస్ట్ హాఫ్ చూసాక అందరూ స్పెల్ బౌండ్ అయిపోతారు. సెకండాఫ్ కూడా అదే తరహాలో ఉంటుందని’ అన్నాడు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్స్ కి, అలాగే డా. మోహన్ బాబు, మంచు విష్ణు స్క్రీన్ ప్రెజెన్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ ‘రౌడీ’ లో జయసుధ మోహన్ బాబుకి జోడీగా నటిస్తే, శాన్వి విష్ణుకి జోడీగా కనిపించనుంది.
ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండడంతో ‘ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు.