లీడర్ సినిమాతో కెరీర్ ప్రారంభించిన రిచా గంగోపాధ్యాయ్ సక్సెస్ఫుల్ హీరోయిన్ గా హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. తను చివరిగా నటించిన ‘మిర్చి’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం రిచా గంగోపాధ్యాయ్ ‘భాయ్’ సినిమా రిలీజ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తోంది.
రిచా అభిమానులు షాక్ అయ్యే ఓ న్యూస్ ని మీకదిస్తున్నాం. రిచా నటనకి కాస్త బ్రేక్ ఇచ్చి అమెరికాలో తన చదువుని కొనసాగించాలనుకుంటోంది. ‘2008 లో లీడర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన రిచా అప్పటి నుంచి తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం తన కెరీర్ చాలా బిజీ గా సాగిపోతున్న సమయంలో తను ఈ విషయం గురించి చాలా సార్లు ఆలోచించి మరీ సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకుంది.
అలాగే రిచా ‘నేను సినిమాలు చెయ్యడం మానెయ్యడం లేదు. నా స్టడీస్ పూర్తవ్వగానే మళ్ళీ సినిమాల్లోకి వస్తానని నా అభిమానులకు ప్రామిస్ చేస్తున్నాను. అలాగే ట్విట్టర్ ద్వారా నా అభిమానులతో టచ్ లో ఉంటానని’ తెలిపింది. చివరిగా తనతో పనిచేసిన అందరికీ థాంక్స్ చెప్పింది.