విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన ‘ది అటాక్స్ అఫ్ 26/11’ తెలుగులోకి డబ్ చేసారు, అలాగే వర్మకి ఇది కమ్ బ్యాక్ ఫిల్మ్. ఈ సినిమా ఈ శుక్రవారం భారీ ఎత్తున విడుదల కావడానికి సిద్దమవుతోంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు, అలాగే ఇండస్ట్రీలో కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ ఉంది. 2008 నవంబర్ 26 న ముంబై సిటీలో జరిగిన దాడుల ఆధారంగా తెరకెక్కించారు.
‘ది అటాక్స్ అఫ్ 26/11’ సినిమాని ఒకేసారి హిందీ, తెలుగు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. తెలుగు వెర్షన్ కి సంబందించిన డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమాకి సెన్సార్ వారు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ముంబై పోలీస్ కమీషనర్ పాత్రలో నానా పటేకర్, అజ్మల్ కసబ్ పాత్రలో సంజీవ్ జైస్వాల్ కనిపించనున్నారు.