వర్మ- మోహన్ బాబుల ‘రౌడీ’కి ‘ఏ’ సర్టిఫికేట్

వర్మ- మోహన్ బాబుల ‘రౌడీ’కి ‘ఏ’ సర్టిఫికేట్

Published on Mar 28, 2014 6:00 PM IST

rowdy
విలక్షణ నటుడు డా. మోహన్ బాబు, న్మంచు విష్ణు హీరోలుగా విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘రౌడీ’. ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సెన్సార్ వారు ‘ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు. ప్రస్తుతానికి సెన్సార్ వారు ఏమేమి కట్స్ విధించారు అనే విషయం ఇంకా తెలియలేదు.

రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 4న ప్రపంచ వ్యాపతంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. మోహన్ బాబుకి జోడీగా జయసుధ నటించిన ఈ మూవీలో విష్ణుకి జోడీగా శాన్వి నటించింది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్స్, సాంగ్స్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.

అలాగే రెండు రోజుల క్రితమే మోహన్ బాబు మొదట ఈ సినిమాని మహిళా ప్రేక్షకులకి వేసి చూపిస్తానని అన్నాడు. సాయి కార్తీక్ సంగీతం అందించాడు. ఈ సినిమాకి ఎన్ని కట్స్ విధించారు, ఎన్ని డైలాగ్స్ బీప్స్ చేసారు అనే వివరాల కోసం సైట్ ని విజిట్ చేస్తూ ఉండండి.

తాజా వార్తలు