తెలుగు లో సినిమాకి సినిమాకి మధ్యలో పెద్దగా గ్యాప్ తీసుకొని దర్శకుల్లో ఆర్.జి.వి ఒకరు. అంతేకాకుండా ఒక్కో సినిమా ని ఆర్.జి.వి పూర్తి చేసే విధానం తెలుగు చిత్ర పరిశ్రమ లో చాలా మందిని ఆశ్చర్యపరుస్తుంది. చూస్తువుంటే ఈ యేడాది లో ఆర్.జి.వి చిత్రాలు మూడు విడుదల కానున్నాయి.
‘రౌడీ’ రిలీజ్ అయిన ఒక్క రోజు తర్వాత ఆర్.జి.వి తన తాజా హారర్ చిత్రం ‘పట్ట పగలు’ మొదటి లుక్ ని విడుదల చేయడానికి సిద్ధం అయ్యాడు. పోస్టర్ నిన్నే రిలీజ్ అవ్వగా ట్రైలర్ ని త్వరలో విడుదల చేయనున్నారు. డా. రాజశేఖర్ ముఖ్య పాత్ర పోషించిన ఈ చిత్రం లో స్వాతి దీక్షిత్ ఆయన కూతురి గా నటిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విషయాలు వెల్లడి కావాల్సి వుంది.
అంతా అనుకున్నట్టు జరిగితే ఈ సినిమా మే లో విడుదలకానుంది. ఇదేకాక విష్ణు హీరోగా నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ కూడా త్వరలో విడుదలకానుంది