రాజకీయ నాయకులపై సెటైర్స్ వేస్తున్న వర్మ

రాజకీయ నాయకులపై సెటైర్స్ వేస్తున్న వర్మ

Published on Feb 22, 2013 12:00 PM IST

Ram-Gopal-Varma2

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ఒక్క మాటలో చెప్పలేం . అవసరమైతే ఆయన పెద్ద మనుషులను కూడా టార్గెట్ చేసి మాట్లాడుతుంటారు. ఆయన నిన్న హైదరాబాద్లో జరిగిన వరుస బాంబ్ పేలుళ్ళ తరువాత తన ట్విట్టర్లో ఘాటుగా స్పందించారు. ఆయన రాజకీయ నాయకుల గురించి మాట్లాడుతూ ఇలాంటి ఉగ్రవాదుల దాడి తరువాత వారు ఎలా స్పందిస్తారు అనే విషయాన్ని సెటైర్ రూపంలో ట్వీట్ చేసారు. ఆ ట్వీట్స్ ఏమిటో చూడండి.

‘ బాంబ్ పేలుడు ఖండిస్తున్నాము అన్న ముఖ్యమంత్రి గారి డైలాగు 1965 బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి వింటున్నాం — అరగదీసిన పరాకాష్ట డైలాగు ఇది’

‘ఢిల్లీ నుంచి స్పెషల్ టీంను రప్పిస్తున్నాము అనే మాటకు అర్థం లోకల్ టీం వెదవలనా?’

‘పొలిటీషియన్స్ బాంబ్ బ్లాస్ట్ బాధితులకి ప్రగాడ సానుభూతిని పుట్టిన రోజు గిఫ్ట్స్ ఇచ్చినట్టు ఇస్తున్నారు’

‘ పి.ఎమ్ గారు దిగ్భ్రాంతి వ్యక్తం చేయకుండా సంతోషం వ్యక్తం చేస్తారనుకుంటమా మనం? కోన వెంకట్ లాంటి మంచి రచయితలు రాజకీయ నాయకులకు అవసరం’

‘పేలుళ్ళ పై విచారణ జరిపిస్తాం అన్న షిండే గారి డైలాగ్ ఈ దశాబ్దానికి నిజంగా చాలా గొప్ప డైలాగు వాహ్……… ‘

రామ్ గోపాల్ వర్మ మరొకసారి వార్తల్లోకి వచ్చారు. ఈ మాటలను గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్ ?

తాజా వార్తలు