పూరి చేసిన చీటింగ్… 20ఏళ్లకు బయటపెట్టిన రేణూ.. !

పూరి చేసిన చీటింగ్… 20ఏళ్లకు బయటపెట్టిన రేణూ.. !

Published on Apr 22, 2020 7:06 AM IST

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ మొదటి చిత్రం బద్రి. అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ మూవీ 20ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా నటించిన రేణూ దేశాయ్ ఈ మూవీతో తనకు ముడిపడిన ఙ్ఞాపకాలు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ తో వీడియో లైవ్ చాట్ చేస్తుండగా డైరెక్టర్ పూరి లైన్ లోకి వచ్చారు. వీరిద్దరూ అప్పటి సంగతులు నెమరు వేసుకున్నారు.

కాగా పూరి అప్పట్లో బద్రి సినిమాలో నువ్వే మెయిన్ హీరోయిన్ అన్నారట. నిజానికి ఆ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నికీషా పటేల్ పాత్ర ఉంటుంది. అప్పట్లో నన్ను మీరు చీటింగ్ చేశారు అని రేణూ అనగా.. ఆ సినిమా తరువాత అనేక మార్లు మీకు నా సినిమాలలో ఆఫర్స్ ఇచ్చాను.. ఐతే మీరు చేయలేదు అన్నారు. ఇక మీ నెక్స్ట్ మూవీ ముసలి అమ్మ పాత్ర అయినా చేస్తాను అని రేణూ పూరీని రిక్వెస్ట్ చేయడం గమనార్హం. అలాంటి పాత్ర మీకు ఇస్తే మీ ఫ్యాన్స్ నన్ను తిట్టుకున్నారు అని పూరి ఆ ఆసక్తికర సమాధానం చెప్పారు. ఇలా వీరి మధ్య ఓ ఆసక్తికర సంభాషణ నడిచింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు