నందమూరి తారకరామారావు పరిచయం అక్కర్లేని వ్యక్తి. కోట్లాది మంది తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయిన అన్నగారు గురించి ఈ రోజు గుర్తు చేసుకుందాం. ఈ రోజు ఆయన 16వ వర్ధంతి. 1923 మే 23న కృష్ణా జిల్లాలోని నిమ్మకూరు అనే గ్రామంలో చిన్న వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన 320 కి పైగా చిత్రాల్లో నటించారు.
పౌరాణికం పాత్రలు వేయడంలో ఆయనను మించిన వారు లేరు. ‘పాతాల భైరవి’, ‘మిస్సమ్మ’, ‘మాయా బజార్’, ‘గుండమ్మ కథ’, ‘రాముడు భీముడు’, దాన వీర శూర కర్ణ’, ‘బొబ్బిలి పులి’, ‘వేటగాడు’ ఇవే కాక ఇంకా చాలా బ్లాక్ బస్టర్ హిట్స్ ఆయన సాధించారు. ఆయన రావణ మరియు దుర్యోధన వంటి నెగటివ్ పాత్రలు కూడా పోషించారు. ఆయన తన అధ్బుత నటనతో మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.
ఆయన రాముడు మరియు కృష్ణుడు వంటి పాత్రలు పోషించి వాటికి ప్రాణం పోసారు. ఆయన నటుడిగానే కాకుండా నిర్మాత మరియు దర్శకుడిగా సక్సెస్ సాధించారు.
123తెలుగు.కామ్ తరపున ఆయన ఆత్మకి శాంతికి కలగాలని కోరుకుంటున్నాం.