అందాల భామ రీమాసేన్ తన అందం మరియు అభినయంతో ఎంతో మంది తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తను నటించిన ‘చిత్రం’, ‘మనసంతా నువ్వే’, ‘వీడే’ మరియు ‘బావ నచ్చాడు’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఈ భామ గత ఏడాది ఢిల్లీకి చెందిన బుజినెస్ మెన్ శివ్ కరణ్ ని వివాహం చేసుకుంది. వారి సన్నిహితులు ఇచ్చిన సమాచారం ప్రకారం రీమాసేన్ త్వరలోనే తల్లి కాబోతున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్న ఈ భామ తనకున్న అన్నిరకాల పనులని పూర్తి చేసుకొని 2013 సగం కల్లా మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారభించాలనుకుంటోంది. ఇటీవలే తను బాలీవుడ్లో నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్’ సినిమాలో తన నటనకి మంచి మార్కులు కొట్టేసింది.
ఈ సందర్భంగా రీమాసేన్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.!