నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తన ఆల్ టైం హిట్ దర్శకుడు బోయపాటి శ్రీనుతో మరో పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ ను చేస్తున్న సంగతి తెలిసిందే. మరి అలాగే దీనితో పాటుగా ఈ చిత్రానికి గాను ఇటీవలే ఒక విడుదల తేదీని కూడా మేకర్స్ లాక్ చేశారు. అయితే ఇంతకు ముందు బాలయ్య సినిమాలు అంటే ఏమో కానీ దీనిపై మాత్రం భారీ స్థాయి అంచనాలే నెలకొన్నాయి. మరి అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాకు బిజినెస్ పనులు కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది.
ఇప్పటి పలు ఏరియాల్లో సాలిడ్ ఫిగర్స్ కే ఈ చిత్రం తాలుకా థియేట్రికల్ హక్కులు అమ్ముడుపోతున్నాయని కూడా తెలుస్తుంది. అలాగే బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ ఫిగర్స్ టచ్ చెయ్యనున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఫైనల్ గా బాలయ్య లెక్కలు ఎక్కడ ఆగుతాయో చూడాలి. ఇక ఈ చిత్రంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.