అల్యూమినియం ఫాక్టరీలో చిత్రీకరణ జరుపుకోనున్న రెబెల్


యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాబోతున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రెబెల్” చిత్రం గురించి మా వద్ద ఆసక్తికరమయిన విషయం ఉంది. ఈ చిత్రంలో కొన్ని కీలక సన్నివేశాలను సోమవారం నుండి గచ్చిబౌలి వద్ద ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరించనున్నారు. ఈ చిత్ర బృందం మొత్తం ఆ లొకేషన్లో ఉండబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రం దాదాపుగా పూర్తి కావచ్చింది సెప్టెంబర్ 14న ఆడియో ఆవిష్కరణ జరుపుకోనుంది. తమన్నా మరియు దీక్ష సెత్ లు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తుండగా ప్రముఖ కొరియోగ్రాఫర్ లారెన్స్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని జే.భగవాన్ మరియు జే.పుల్లారావు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.

Exit mobile version