చివరి పాట చిత్రీకరణలో ‘రెబల్’


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, తమన్నా మరియు దీక్షా సేథ్ హీరోయిన్లుగా నటిస్తున్న ‘రెబల్’ చిత్రం చిత్రీకరణ చివరికి చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటతో ఈ చిత్రం చిత్రీకరణ పూర్తవుతుంది. జె. భగవాన్ మరియు జె. పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు ఒక కీలక పాత్ర పోషించారు. చాలా కాలంగా ప్రొడక్షన్ దశలోనే ఉన్న ఈ చిత్రం గురించి ఇటీవలే ప్రభాస్ తొందరగా ఈ చిత్రాన్ని పూర్తి చేయమని లారెన్స్ ని కోరారు, ప్రభాస్ తొందరగా ఈ సినిమా పూర్తి చేసి తన తదుపరి సినిమా చిత్రీకరణలో పాల్గొనాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి సంగీతం కూడా లారెన్స్ గారే అందిస్తున్నారు. ఈ చిత్ర ఆడియోను ఆగష్టు చివరి వారంలో విడుదల చేసి ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version