గత కొన్ని సినిమాల నుంచి విజయాలు లేక పూర్తిగా డీలా పడిపోయిన హీరో మాస్ మహారాజ రవితేజ. ప్రస్తుతం బాక్స్ ఆఫీసు దగ్గర ఓ మంచి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. అందుకే గతంలో రవితేజ – ఎస్.ఎస్ రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ‘విక్రమార్కుడు’ సినిమా ద్వారా ప్రజల్లో బాగా ప్రాచుర్యం పొందిన పాట జింతాత. ప్రస్తుతం ఆ పాటలోని ‘జింతాత’ అనే పదం సినిమా టైటిల్ గా పెట్టుకుని రవితేజ ఓ సినిమా చేయబోతున్నాడు.
ఈ చిత్రం 2013 జనవరిలో ప్రారంభం కానుంది. ‘ఈగ’ చిత్రంతో ఈ సంవత్సరం బ్లాక్ బస్టర్ అందుకున్న సాయి కొర్రపాటి నిర్మించనున్న ఈ చిత్రానికి ఎం.ఎం కీరవాణి సంగీతం అందించనున్నారు. ఎస్.ఎస్ రాజమౌళి దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన కోటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ‘జింతాత్త’ అనే టైటిల్ రవితేజకి హిట్ ఇస్తుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. ఇప్పటికి మాత్రం ఈ చిత్ర టీంకి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాం. కోటి ముందుగా ఈ చిత్రాన్ని నాగ చైతన్యతో తీయాలని అనుకున్నారు అది కుదరక పోవడంతో ఆ అవకాశం రవితేజని వరించింది.