ప్రస్తుతం మన టాలీవుడ్ లో ఒక్కసారిగా రాబోవు సినిమాల విడుదల తేదీల వరద స్టార్ట్ అయ్యింది. దాదాపు అన్ని బడ్జెట్ సినిమాలు కూడా ఒక డేట్ ను లాక్ చేసేసుకుంటూ వస్తున్నాయి. గత రెండు రోజుల నుంచి కొనసాగుతున్న ఈ పరంపరంలో మాస్ మహారాజ్ రవితేజ కూడా మళ్ళీ యాడ్ అయ్యాడు.
ఇప్పటికే “క్రాక్” తో ఈ ఏడాది కి సూపర్ డూపర్ హిట్ కొట్టి శుభారంభాన్ని ఇచ్చిన మాస్ మహారాజ్ తన నెక్స్ట్ సినిమా “ఖిలాడి” ను ఎంతో లేట్ చెయ్యకుండా ఈ మే లోనే విడుదలకు రెడీ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసేసారు. దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ను ప్రపంచ వ్యాప్తంగా మే 28న విడుదల చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసి రిలీజ్ పోస్టర్ ను విడుదల చేశారు.
ఇక ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్స్ లో కనిపించనుండగా డింపుల్ హయాతి అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా పెన్ మూవీస్ మరియు కోనేరు సత్యన్నారాయణ నిర్మాణం వహిస్తున్నారు.