హైదరాబాద్ లో రవితేజ పవర్ చిత్రీకరణ

హైదరాబాద్ లో రవితేజ పవర్ చిత్రీకరణ

Published on Mar 26, 2014 1:48 AM IST

Power_raviteja1
‘పవర్’ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ తో హన్సిక నటిస్తుంది. రేజీనా రెండవ కధానాయిక. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. బాబీ ఈ సినిమాకు దర్శకుడు. రాక్ లైన్ వెంకటేష్ నిర్మాత. వేసవి చివర్లో ఈ సినిమా మనముందుకు రానుంది.

బెంగుళూరు, హైదరాబాద్ లలో పలు ముఖ్య ప్రాంతాల దగ్గర కొన్ని సన్నివేశాలను, రెండు పాటలను రవితేజ, హన్సికల నడుమ చిత్రీకరించారు. ప్రస్తుతం షెడ్యూల్ ని హైదరాబాద్ లో చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్ లో రెజినా షూటింగ్ లో పాల్గుననుంది. తరువాత షెడ్యూల్లను చిత్రబృందం కలకత్తా, బ్యాంకాక్ లలో చిత్రీకరించనున్నారు.

కోనా వెంకట్ సంభాషణలను అందించారు. ఆర్థర్ విల్సన్ సినిమాటోగ్రాఫర్. థమన్ సంగీతదర్శకుడు.

తాజా వార్తలు