‘రోమియో’లో రవితేజ

‘రోమియో’లో రవితేజ

Published on Oct 21, 2012 7:00 PM IST


పూరి జగన్నాధ్ తమ్ముడు సాయి రామ్ శంకర్ లేటెస్ట్ మూవీ రోమియో ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. సాయి రామ్ శంకర్ సరసన అడోనికా నటిస్తుంది. పూరి జగన్నాధ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన గోపి గణేష్ ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నాడు. తన శిష్యుడు దర్శకుడిగా మారటం, తన తమ్ముడే హీరో కావడంతో ఈ సినిమాకి స్టొరీ, డైలాగ్స్ పూరి స్వయంగా రాసాడు. పూరి మీద ఉన్న అభిమానంతో రవితేజ ఈ సినిమా అతిధి పాత్రలో నటించడానికి ఒప్పుకున్నాడు. 5 నిమిషాల నిడివి గల పాత్రలో రవితేజ కనిపించబోతున్నాడు. పి.జి వినడ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకి సునీల్ కశ్యప్ సంగీతం అందించారు.

తాజా వార్తలు