మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న ‘బలుపు’ షూటింగ్ ప్రస్తుతం సింహాచలంలో జరుగుతోందని ఇదివరకే తెలిపాము. రవితేజని ‘డాన్ శీను’గా చూపించిన గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఇప్పటికే దాదాపు 50% షూటింగ్ పూర్తి చేసుకుంది. ఫాస్ట్ గా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాని 2013 మేలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమాలో శ్రుతి హాసన్, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కోనా వెంకట్ కథ అందించిన ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. పి.వి.పి బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.