స్టార్ బ్యూటీ త్రిష ఇటీవలకాలంలో చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. ఆమె చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. అయితే, తన కెరీర్‌లో త్రిష నటించిన తొలి వెబ్ సిరీస్ ‘బృందా’ ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయింది. 2024లో వచ్చని ఈ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ సోని లివ్‌లో స్ట్రీమింగ్ అయింది.
ఈ వెబ్ సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ దక్కింది. ఈ వెబ్ సిరీస్‌లోని ట్విస్టులు ప్రేక్షకులను థ్రిల్ చేశాయి. అయితే, ఇప్పుడు ఈ సిరీస్‌కు సీక్వెల్‌ను తీసుకొస్తుంది త్రిష. ఇప్పటికే బృందా సీజన్ 2 షూటింగ్ ముగిసిందని.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఈ సిరీస్ బిజీగా ఉందని మేకర్స్ చెబుతున్నారు.
ఇక ఈ సిరీస్‌లో త్రిష మరోసారి ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయమని మేకర్స్ తెలిపారు. సూర్య మనోజ్ వంగాల డైరెక్ట్ చేస్తున్న ఈ థ్రిల్లర్ సిరీస్‌లో రవీంద్ర విజయ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సిరీస్‌ను త్వరలోనే సోని లివ్‌లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.