ఓటిటిలోకి వచ్చేసిన బాలీవుడ్ ని షేక్ చేసిన ‘సైయారా’

ఓటిటిలోకి వచ్చేసిన బాలీవుడ్ ని షేక్ చేసిన ‘సైయారా’

Published on Sep 12, 2025 9:00 AM IST

Saiyaara

ఇటీవల బాలీవుడ్ సినిమా నుంచి ఒక సంచలన విజయం చిత్రం ‘సైయారా’ కోసం అందరికీ తెలిసిందే. ఆహాన్ పాండే హీరోగా అనీత్ పద్దా హీరోయిన్ గా దర్శకుడు సూరి తెరకెక్కించిన రొమాంటిక్ లవ్ స్టోరీ సినిమా ఇది కాగా భారీ హైప్ నడుమ వచ్చి ఇండియన్ సినిమా దగ్గర ఏ డెబ్యూ హీరోకి లేని రికార్డు వసూళ్లు తెచ్చి పెట్టింది.

ఇలా బాలీవుడ్ లో పెను సంచలనాలు సెట్ చేసిన ఈ సినిమా ఎట్టకేలకి ఓటిటి ఆడియెన్స్ ని అలరించేందుకు వచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా వారు నేటి నుంచి ఈ సినిమాని అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ఈ సినిమా కేవలం హిందీలో మాత్రమే ఇపుడు స్ట్రీమింగ్ అవుతుంది.

సో హిందీ అర్ధం అయ్యేవారు, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూడగలిగేవారు ఈ సినిమాని ట్రై చేస్తే చేయవచ్చు. ఇక ఈ సినిమాకి మిథూన్, సచేత్ పరంపర, రిషబ్ కాంత్, విశాల్ మిశ్రా, తనిష్క్ బాగ్చి, ఫహీమ్ అబ్దుల్లా, అర్స్లాన్ నిజామి లు సంగీతం అందించగా యష్ రాజ్ ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

తాజా వార్తలు