పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ సినిమా “ఓజి” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా కోసం అభిమానులు ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తుండగా ఈ సినిమా ఆఫ్ లైన్ ప్రమోషన్స్ అలాగే ఒకే అప్డేట్ తో మరింత హైప్ ఎక్కిస్తున్నారు. ఇలా సినిమా ట్రైలర్ పై కొత్త బజ్ వినిపిస్తుంది.
ముందు అయితే ఈ సెప్టెంబర్ 15న ట్రైలర్ వస్తుంది అన్నట్టు టాక్ వచ్చింది కానీ ఇపుడు ఈ డేట్ మారినట్టు తెలుస్తుంది. దీని ప్రకారం ఈ సెప్టెంబర్ 18న విడుదల చేస్తారట. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తుండగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.