సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా

సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా

Published on Sep 12, 2025 3:02 AM IST

Teja Sajja Mirai Telugu Movie Review in Telugu

విడుదల తేదీ : సెప్టెంబర్ 12, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.5/5

నటీనటులు : తేజ సజ్జ, మంచు మనోజ్, రితిక నాయక్, శ్రియా శరన్, జగపతి బాబు, జైరాం, గెటప్ శ్రీను
దర్శకుడు : కార్తీక్ ఘట్టమనేని
నిర్మాతలు : టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్
సంగీత దర్శకుడు : గౌర హరి
సినిమాటోగ్రాఫర్ : కార్తీక్ ఘట్టమనేని
ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ నుంచి వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ చిత్రమే “మిరాయ్”. భారీ విజువల్స్ తో ప్లాన్ చేసిన ఈ సినిమా ఈగల్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని నుంచి మరో ప్రాజెక్ట్ గా వచ్చింది. మరి ఈ సినిమా అంచనాలు అందుకుందో లేదో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

కళింగ యుద్ధం తర్వాత ఎంతో పశ్చాత్తాపానికి లోనైన అశోకుడు తనలోని శక్తులని మొత్తం 9 గ్రంథాలు (ఒకో గ్రంథానికి ఒకో దివ్య శక్తి కలిగి ఉంటుంది) లోకి ఇమిడింపజేసి ప్రపంచ నలు మూలాల ఉన్న 9 మంది రక్షకులకి అందిస్తాడు. అక్కడ నుంచి ప్రస్తుత కాలానికి ఒకో గ్రంథాన్ని చేజిక్కించుకొని తాను భగవంతునిగా మారాలని చూసే క్రూరుడు మహావీర్ (మంచు మనోజ్) ప్రయత్నిస్తాడు. అలా తొమ్మిదో గ్రంథం అంబిక (శ్రియా శరన్) రక్షలో ఉంటుంది. మరి దానికి తన కొడుకు వేద (తేజ సజ్జ) ఎలా రాముని కాలానికి చెందిన మిరాయ్ ని చేజిక్కించుకొని రక్షకుడిగా మారాడు. తాను వేద నుంచి యోధ గా ఎలా పరిణామం చెందాడు? ఈ క్రమంలో తాను ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? చివరికి ఆ తొమ్మిదో గ్రంథం మహావీర్ కి దక్కకుండా చేశాడా లేదా? అసలు ఆ మిరాయ్ ఏంటి? మహావీర్ గతం ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ సినిమా చూడాలి.

ప్లస్ పాయింట్స్:

మొదటిగా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఎంచుకున్న కథ తన విజన్ ఈ సినిమాలో గ్రాండ్ గా కనిపిస్తాయి. ఒక ఇంట్రెస్టింగ్ నేపథ్యాన్ని తాను ఎంచుకొని ఒక గ్రాండ్ ట్రీట్ ఇచ్చే ప్రయత్నం తాను చేయడం హర్షణీయం. ముఖ్యంగా తన శక్తికి మించి పెట్టిన ఎఫర్ట్స్ భారీ విజువల్స్ అందులో డివోషనల్ గా ఇచ్చిన ఎలివేషన్స్ లో తన విజన్ కనిపిస్తుంది.

ముఖ్యంగా సప్తపది గరుడ ఎపిసోడ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఆ విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం బిగ్ స్క్రీన్ పై సాలిడ్ గా కనిపిస్తాయి. అలాగే తేజ సజ్జ రోల్ నీట్ గా వెళుతుంది. తన అడ్వెంచరస్ ప్రయాణం అందులోని సవాళ్లు నీట్ గా డిజైన్ చేసుకున్నారు. తన పాత్రకి తేజ సరిగ్గా కుదిరాడు. మంచి లుక్స్ అండ్ ఎమోషన్స్ ని తాను పండించాడు. యాక్షన్ పార్ట్ లో అయితే అదరగొట్టాడని చెప్పవచ్చు.

అలాగే మంచు మనోజ్ ఈ పాత్రని ఎందుకు ఎంచుకున్నాడో సమాధానం ఈ సినిమాలో గట్టిగా కనిపిస్తుంది. తాను ఈ సినిమాలో రోల్ ని చాలా ఛాలెంజింగ్ గా కూడా చేశారు. కొన్ని ఇబ్బందికర సన్నివేశాలని సైతం మనోజ్ చేయడం తన గట్స్ ని మరోసారి ప్రూవ్ చేస్తుంది. ముఖ్యంగా తనపై శబ్ద గ్రంధం యాక్షన్ ఎపిసోడ్ కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటుంది. బహుశా ఇలాంటి ఎపిసోడ్ ఇండియన్ సినిమా దగ్గర ఇది వరకు వచ్చి కూడా ఉండకపోవచ్చు. అది చాలా యునిక్ గా అనిపిస్తుంది.

వీరితో పాటుగా శ్రియా శరన్ కి సాలిడ్ రోల్ దక్కింది. అంబిక పాత్రలో శ్రియ బాగా చేశారు. అలాగే నటుడు జైరాం కూడా మంచి పాత్రలో కనిపించి మెప్పించారు. జగపతిబాబు, హీరోయిన్ రితికా సింగ్ లు బలమైన పాత్రల్లో కనిపించి వారికి ఉన్న ముఖ్య సన్నివేశాల్లో బాగా చేశారు. గెటప్ శ్రీను రోల్ బాగుంది మంచి కామెడీ సీన్స్ వర్కౌట్ అయ్యాయి.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాలో ప్రధానాంశం బాగున్నప్పటికీ కథనం ఇంకాస్త గ్రిప్పింగ్ గా తీసుకెళ్లి ఉంటే బాగుండేది. అప్పటికే వైబ్ ఉంది లాంటి సాంగ్స్ ని తీసేసినప్పటికీ కథనం అలా సాగుతున్న ఫీల్ కలుగుతుంది. ఫస్టాఫ్ లో తెలుగు నటులు, తేజ, గెటప్ శ్రీను ఇంకొందరు తెలుగు నటులు తప్పితే మిగతా నటీనటులపై సన్నివేశాలు చూస్తే ఇది తెలుగు సినిమా చూసినట్టే అనిపించదు మన నుంచి తెరకెక్కిన డబ్బింగ్ సినిమా ఫీల్ అనిపిస్తుంది.

ఈ అడ్వెంచరస్ డ్రామాలో పలు ఎపిసోడ్స్ ఇది వరకే మనం చూసిన ఈ తరహా సినిమాలని కూడా గుర్తు చేయక మానవు. సో అవీ రొటీన్ ఫీల్ కలిగిస్తాయి. ముఖ్యంగా ఈగల్ లాంటి సాలిడ్ వర్క్ ని అందించిన కార్తీక్ నుంచి ఇంకా ఏదో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ని ఆశించినవారు కొంతమేర నిరాశ చెందవచ్చు. అలాగే క్లైమాక్స్ ఇంకొంచెం ఎంగేజింగ్ గా ఎండ్ చేసి ఉంటే బాగుండేది.

సాంకేతిక వర్గం:

ఈ సినిమా నిర్మాణ విలువలు మాత్రం ఎక్స్ట్రార్డినరీగా ఉన్నాయని చెప్పవచ్చు. తక్కువ బడ్జెట్ లోనే సాలిడ్ ప్రాజెక్ట్ లు చేయొచ్చు అని చూపించడానికి మిరాయ్ ని మరో చక్కటి ఉదాహరణగా చెప్పొచ్చు అనే విధంగా మేకర్స్ తీర్చి దిద్దారు. సినిమాలో యాక్షన్ పార్ట్ కానీ విజువల్ ఎఫెక్ట్స్ పనితీరు గాని సాలిడ్ గా ఉన్నాయి. ఈ రేంజ్ అవుట్ ఫుట్ ని అయితే చాలామంది ఊహించి కూడా ఉండకపోవచ్చు.

అలాగే హను మాన్ సంగీత దర్శకుడు గౌర హరి ఈ సినిమాకి కూడా మంచి డ్యూటీ చేశారు. ఆయా సన్నివేశాలని తన నేపథ్య సంగీతంతో మరింత పవర్ఫుల్ గా ఎలివేట్ చేశారు. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనే కెమెరా వర్క్ కూడా అందించారు. తన వర్క్ ఇందులో స్టన్నింగ్ గా ఉంది. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ డీసెంట్ గా ఉంది. ఇక కార్తీక్ దర్శకత్వ పనితీరు విషయానికి వస్తే.. తాను ఎంచుకున్న కథ, గ్రాండ్ విజన్ బాగున్నాయి. అంధుడు తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్న మూమెంట్స్ కూడా ఇంప్రెస్ చేస్తాయి. కాకపోతే ఈ కథనం కొన్ని చోట్ల మాత్రం ఇంకా బెటర్ గా గ్రిప్పింగ్ గా డిజైన్ చేయాల్సింది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “మిరాయ్” టాలీవుడ్ నుంచి మరో ఇంప్రెస్ చేసే కొత్త ప్రయత్నం అని చెప్పవచ్చు. మంచి అడ్వెంచరస్ డ్రామాలు అందులో మైథలాజి, హిస్టారికల్ ఎలిమెంట్స్ తో సాలిడ్ యాక్షన్ సహా హై మూమెంట్స్ ఎపిసోడ్స్ లాంటివి ఇష్టపడేవారికి మిరాయ్ సాలిడ్ ట్రీట్ ని అందిస్తుంది. ముఖ్యంగా తేజ సజ్జ, మనోజ్ లు తమ రోల్స్ లో అదరగొట్టారు. అలాగే దర్శకుడు విజన్ తన ప్రయత్నంకి మరిన్ని మార్కులు ఇవ్వొచ్చు. సో ఈ చిత్రాన్ని బిగ్ స్క్రీన్స్ పై ఎంజాయ్ చేయవచ్చు

123telugu.com Rating: 3.5/5

Reviewed by 123telugu Team 

తాజా వార్తలు