మాస్ మహా రాజా రవితేజ ‘క్రాక్’ సినిమా తర్వాత ‘నేను లోకల్’ ఫేమ్ నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. నిజానికి రమేష్ వర్మ సినిమా ముందుగా మొదలవ్వాలి. కానీ కొన్ని కారణాల వల్ల రమేష్ వర్మ సినిమా లేట్ అవుతోందట. ఆ కారణంగా రమేష్ వర్మ సినిమా కంటే కూడా త్రినాథరావ్ నక్కిన సినిమానే ముందు మొదలవుతుందట. కాగా ఈ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఉంటుందని… సినిమాలో రవితేజ క్యారెక్టరైజేషన్ మంచి కామెడీ టైమింగ్ తో అద్భుతంగా ఉంటుందని సమాచారం.
పైగా త్రినాథరావ్ నక్కిన గత చిత్రాలు కూడా ‘సినిమా చూపిస్తా మామ’ ‘నేను లోకల్ వంటి సినిమాలు మంచి ఎంటెర్టైమెంట్ తో సాగిన విషయం తెలిసిందే. అదేవిధంగా రవితేజ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం తన మాడ్యులేషన్ తోనే అద్భుతమైన కామెడీని పండించగలడు. రవితేజ అలాంటి కామెడీ సినిమాతోనే ఈ సారి త్రినాథరావ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.