విభిన్న చిత్రాలను తీసే దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రవిబాబు దర్శకత్వంలో వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘అవును’. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఈ సినిమాని హిందీలో రిమేక్ చేయనున్నారు. కేవలం 45 లక్షలతోనే తెరకెక్కించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీసు దగ్గర పెద్ద విజయాన్ని అందుకుంటుందని రవిబాబు కూడా అనుకోని ఉండరు. ఈ చిత్ర టీజర్ విడుదలైనప్పటి నుంచి ఈ చిత్ర హిందీ రైట్స్ కోసం పలువురు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికీ కొంత మందితో రైట్స్ గురించి చర్చలు జరుగుతున్నాయి.
ఈ చిత్ర హిందీ వెర్షన్లో బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ముఖ్య పాత్ర పోషిస్తోందని కూడా వార్తలు వస్తున్నాయి కానీ ఇవన్నీ ఇంకా ఖరారు కాలేదు. ‘అవును’ తెలుగు వెర్షన్లో పూర్ణ మరియు హర్షవర్ధన్ రాణే ప్రధాన పాత్రలు పోషించగా, రవిబాబు అతిధి పాత్రలో కనిపించారు. డి. సురేష్ బాబు మరియు ప్రసాద్ వి పొట్లూరి సమర్పణలో వచ్చిన ఈ చిత్ర హిందీ రిమేక్ కి సంబందించిన విశేషాల గురించి త్వరలోనే తెలియజేయవచ్చు.