‘కాంతార’కు టెండర్ పెట్టిన ‘థామా’..?

‘కాంతార’కు టెండర్ పెట్టిన ‘థామా’..?

Published on Oct 22, 2025 12:00 AM IST

Kantara-Chapter-1-Thamma

కన్నడలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ మూవీ ‘కాంతార చాప్టర్ 1’ బాక్సాఫీస్ దగ్గర భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమాను రిషబ్ శెట్టి తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ట్రెమండస్ రెస్పాన్స్‌తో దూసుకుపోయింది. అక్టోబర్ 2న రిలీజ్ అయిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబడుతూ దూసుకెళ్లింది.

ఇక నార్త్ బెల్ట్‌లోనూ ఈ సినిమా సాలిడ్ కలెక్షన్స్ రాబట్టింది. బాలీవుడ్‌లో పెద్ద సినిమాలు లేకపోవడంతో ‘కాంతార చాప్టర్ 1’కి బాగా కలిసొచ్చింది. అయితే, ఇప్పుడు కాంతార హిందీ రన్‌కు రష్మిక మందన్న ‘థామా’తో చెక్ పెట్టేందుకు రెడీ అయింది. నేడు(అక్టోబర్ 21) థామా గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ ఉంది.

దీంతో కాంతార కలెక్షన్స్‌కు థామా ఎసరు పెట్టే అవకాశం ఉందని సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. మొత్తానికి కాంతార చాప్టర్ 1 డ్రీమ్ రన్‌కు రష్మిక మందన్న ‘థామా’ ఎలాంటి అడ్డు వేస్తుందో చూడాలి.

తాజా వార్తలు