త్రివిక్రమ్-వెంకీ సినిమాలో ‘హిట్’ బ్యూటీ

త్రివిక్రమ్-వెంకీ సినిమాలో ‘హిట్’ బ్యూటీ

Published on Oct 21, 2025 7:31 PM IST

Venkatesh and Trivikram

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, విక్టరీ వెంకటేష్ కాంబోలో ఇటీవల ఓ కొత్త సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాను హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన క్యాస్టింగ్ విషయంలో మేకర్స్ ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.

ఈ సినిమాలో హీరోయిన్‌గా అందాల భామ శ్రీనిధి శెట్టి ఓకే అయినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ‘హిట్-3’ సినిమాతో టాలీవుడ్‌లో సాలిడ్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ, రీసెంట్‌గా తెలుసు కదా చిత్రంతో వచ్చింది. కాగా, నేడు(అక్టోబర్ 21) శ్రీనిధి శెట్టి పుట్టినరోజు సందర్భంగా ఆమె ఈ సినిమాలో నటిస్తుందనే వార్తను మేకర్స్ రివీల్ చేశారు.

వెంకటేష్ వంటి సీనియర్ హీరో సరసన ఈమె నటిస్తుందనే వార్తతో ఒక్కసారిగా ఈ మూవీపై ఆసక్తి క్రియేట్ అయింది. మరి ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి ఎలాంటి పాత్రలో నటిస్తుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

తాజా వార్తలు