మూడు రోజుల్లోనే ‘కె-ర్యాంప్’ బ్రేక్ ఈవెన్..!

మూడు రోజుల్లోనే ‘కె-ర్యాంప్’ బ్రేక్ ఈవెన్..!

Published on Oct 21, 2025 12:07 PM IST

K-Ramp Telugu Movie Review

దీపావళి బరిలో రిలీజ్ అయిన చిత్రాల్లో హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ చిత్రం ‘కె-ర్యాంప్’ కూడా ఒకటి. పక్కా కమర్షియల్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమాను దర్శకుడు జెయిన్స్ నాని డైరెక్ట్ చేయగా, మాస్ అంశాలతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. మిక్సిడ్ టాక్‌తో మొదలైన ఈ సినిమాకు దీపావళి సెలవులు బాగా కలిసొచ్చాయి.

దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర స్ట్రాంగ్ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. ఈ సినిమా రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే వరల్డ్‌వైడ్‌గా రూ.17.5 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు సాధించింది. దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు చేరుకుందని మేకర్స్ సంతోషంగా వెల్లడించారు. కిరణ్ అబ్బవరం పర్ఫార్మెన్స్‌కు థియేటర్లలో విజిల్స్ వేస్తూ మాస్ పబ్లిక్ తెగ ఎంజాయ్ చేస్తున్నారని మేకర్స్ తెలిపారు.

యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, శివ బొమ్మక్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు.

తాజా వార్తలు