పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటించిన రీసెంట్ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘ఓజీ’ ఇటీవల రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. దర్శకుడు సుజీత్ ఈ సినిమాను ప్యూర్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన తీరు ప్రేక్షకులను మెప్పించింది. ఇక పవన్ కళ్యాణ్‌ని అభిమానులు ఎలా అయితే చూడాలని కోరుకున్నారో, సుజీత్ అలా చూపెట్టడంతో ఈ సినిమాకు అభిమానులు పట్టం కట్టారు.
బాక్సాఫీస్ దగ్గర ర్యాంపేజ్ చూపెట్టిన ఓజీ, ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమాపై సోషల్ మీడియాలో పలు రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రా నిర్మాత, డైరెక్టర్‌కు మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయనే వార్తు సినీ సర్కిల్స్‌లో జోరుగా చక్కర్లు కొట్టాయి. అయితే, ఈ పుకార్లకు దర్శకుడు సుజీత్ తాజాగా చెక్ పెట్టాడు.
ఆయన ఓ ఓపెన్ లెటర్‌తో ఈ రూమర్స్‌కు ఫుల్ స్టాప్ పెట్టాడు. ఓజీ చిత్రాన్ని రూపొందించేందుకు చిత్ర యూనిట్ అందరూ తీవ్రంగా కష్టపడ్డామని.. తనకు అండదండగా నిలిచిన నిర్మాతలకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని.. సినిమాను పూర్తి చేసేందుకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ అంటూ ఆయన లెటర్ రాశారు. దీంతో ఓజీ చుట్టూ వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పడింది.
— Sujeeth (@Sujeethsign) October 21, 2025