ఆయనను నమ్మాము.. కానీ మిస్‌ఫైర్ అయ్యింది – నాగవంశీ

ఆయనను నమ్మాము.. కానీ మిస్‌ఫైర్ అయ్యింది – నాగవంశీ

Published on Oct 21, 2025 9:00 PM IST

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస్ నాగవంశీ పలు క్రేజీ చిత్రాలను రూపొందిస్తూ ఇండస్ట్రీలో టాప్ నిర్మాతల్లో ఒకరిగా ఉన్నారు. అయితే, ఆయన ఇటీవల చేసిన కొన్ని కామెంట్స్ పలు వివాదాలకు దారితీశాయి. దీంతో ఆయనపై సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ జరిగింది. కాగా, ఆయన రీసెంట్‌గా డిస్ట్రిబ్యూట్ చేసిన ప్రెస్టీజియస్ చిత్రం ‘వార్-2’ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

ఈ విషయంపై ఆయన తాజాగా క్లారిటీ ఇచ్చారు. తనతో పాటు హీరో ఎన్టీఆర్ యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాత ఆదిత్య చోప్రాను నమ్మామని.. కానీ, సినిమా మిస్‌ఫైర్ అయ్యిందని.. దీంతో సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేశారంటూ నాగవంశీ చెప్పుకొచ్చారు. ఇక తాము కేవలం వార్-2 సినిమాను డిస్ట్రిబ్యూట్ మాత్రమే చేశామని.. దాన్ని నేరుగా తీసి ఉంటే ఇంకోలా రెస్పాన్స్ ఉండేదని ఆయన అన్నారు.

ఏదేమైనా సోషల్ మీడియాలో ప్రశంసలతో పాటు విమర్శలను కూడా సమానంగా తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఇక నాగవంశీ ప్రొడ్యూస్ చేస్తన్న మాస్ రాజా రవితేజ కొత్త చిత్రం ‘మాస్ జాతర’ అక్టోబర్ 31న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది.

తాజా వార్తలు