అన్ స్టాపబుల్ ‘మీసాల పిల్ల’.. ఏకంగా 50 మిలియన్ వ్యూస్!

అన్ స్టాపబుల్ ‘మీసాల పిల్ల’.. ఏకంగా 50 మిలియన్ వ్యూస్!

Published on Nov 8, 2025 4:02 PM IST

meesala-pilla

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా సూపర్ హిట్ దర్శకుడు అనీల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “మన శంకర వరప్రసాద్ గారు”. ఫ్యామిలీ ఆడియెన్స్ లో ఆల్రెడీ సాలిడ్ బజ్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం నుంచి ఇటీవల వచ్చిన ఫస్ట్ సింగిల్ మీసాల పిల్ల ట్రెండింగ్ హిట్ అయ్యింది.

భీమ్స్ అందించిన ఈ సాంగ్ సెన్సేషనల్ రీచ్ ని సొంతం చేసుకొని అన్ స్టాపబుల్ గా దూసుకెళ్తుంది. ఇలా లేటెస్ట్ గా ఈ సాంగ్ ఏకంగా 50 మిలియన్ వ్యూస్ మార్క్ ని దాటి దూసుకెళ్తుంది. మరి ఇది ఇంకెక్కడ వరకు వెళుతుందో చూడాలి. ఇక ఈ సినిమాలో వెంకీ మామ కూడా కీలక పాత్ర చేస్తుండగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని మేకర్స్ తీసుకొస్తున్నారు. అలాగే ఈ సినిమాని షైన్ స్క్రీన్ సినిమాస్ వారు నిర్మాణం వహిసున్నారు.

తాజా వార్తలు