ఇప్పటి స్టార్ హీరోయిన్ అప్పుడు ఎంత క్యూట్ గా ఉందో కదా!

ఇప్పటి స్టార్ హీరోయిన్ అప్పుడు ఎంత క్యూట్ గా ఉందో కదా!

Published on Feb 20, 2021 3:00 PM IST

ప్రస్తుతం సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్ గా ఉన్న బ్యూటీ, సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర ఫోటో పంచుకున్నారు. తన స్కూల్ డేస్ లో కల్చరల్స్ లో పాల్గొన్న ఫోటో పంచుకొని, తన ఫ్యాన్స్ కి చిన్న ఫజిల్ విసిరారు. ఆ సాంగ్ కి తన ఎక్స్ప్రెషన్స్ ఛండాలంగా ఉన్నాయని, అయితే నేను పెర్ఫార్మ్ చేసిన, ఆ పాటను మీరు కనిపెట్టాలని అన్నారు. ఆ సాంగ్ 2004- 05లో వచ్చిన పాట అంటూ చిన్న హింట్ కూడా ఇచ్చారు.

తన చిన్నప్పటి ఫోటో పంచుకొని, ఫజిల్ విసిరిన ఆ హీరోయిన్ ఎవరో కాదు, రష్మిక మందాన. ఆరేడు ఏళ్ల ప్రాయంలో తన క్లాస్ మేట్ తో పాటు స్టేజ్ పై డాన్స్ చేస్తున్న రష్మిక క్యూట్ గా ఉన్నారు. అప్పుడు భయపడుతూ డాన్స్ చేసిన ఈ అమ్మడు, ఇంత పెద్ద స్టార్ అవుతుందని ఎవరూ ఊహించి ఉండరు.

ప్రస్తుతం రష్మిక చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. అల్లు అర్జున్ కి జంటగా సుకుమార్ దర్శకత్వంలో ఆమె చేస్తున్న చిత్రం పుష్ప పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానుంది. అలాగే ఓ హిందీ చిత్రానికి రష్మిక సైన్ చేశారు. దళపతి విజయ్ నెక్స్ట్ మూవీలో కూడా రష్మిక ఆఫర్ కొట్టేశారని వార్తలు వస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు