ప్రత్యేకం : పూరితో రాపిడ్ ఫైర్ రౌండ్

ప్రత్యేకం : పూరితో రాపిడ్ ఫైర్ రౌండ్

Published on Oct 18, 2012 8:59 AM IST


దర్శకుడు పూరి జగన్నాథ్ బాక్స్ ఆఫీస్ బాబురావుకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు అందులో చాలా ఆసక్తికరమయిన ప్రశ్నలతో పాటు పూరి జగన్నాథ్ ఆసక్తికరమయిన సమాధానాలు కూడా ఉన్నాయి (ఆ ఇంటర్వ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి). ఈ ఇంటర్వ్యూ కాకుండా పూరి గారితో రాపిడ్ ఫైర్ రౌండ్ కూడా జరిపాము. అందులో మేము అడిగిన ప్రశ్నలు వాటికి పూరి ఇచ్చిన సమాధానాలు మీకోసం

ప్ర) నచ్చే రంగు
జ) నలుపు

ప్ర) నచ్చే కార్
జ) మారుతీ జెన్ – అదే నా మొదటి కార్. మొదటి కార్ ఎప్పటికీ ప్రత్యేకమే కదా

ప్ర)నచ్చే పెంపుడు జంతువు
జ) ఒకటని లేదు. నేను పెంచుకునే అన్ని నాకు చాలా ఇష్టం

ప్ర) మీరు దేవుడిని నమ్ముతారా?
జ) నమ్ముతాను కాని మూడనమ్మకాలని కాదు

ప్ర) హీరొయిన్ ప్రాధాన్యమున్న చిత్రాలు చేసే అవకాశం ఉందా?
జ) చేస్తాను కొన్ని కథలు సిద్దంగా ఉన్నాయి.

ప్ర) మీ చిత్రాలలో బలమయిన కథానాయిక పాత్ర ఏది
జ) నేను నా రాక్షసి చిత్రంలో ఇలియానా

ప్ర) చిత్రీకరణ కష్టమయిన చిత్రం
జ) ఏది లేదు

ప్ర) ఒక కథ సిద్దం చెయ్యడానికి తీసుకునే సమయం
జ) 15 రోజులు

ప్ర) తమిళంలో చిత్రం చెయ్యాలని అనుకుంటున్నారా?
జ) అవును దానికోసమే చూస్తున్నాను

ప్ర) ఆకాశ్ (పూరి కొడుకు) భవిష్యత్ ప్రణాళిక ఏంటి ?
జ) చిత్రాల గురించి చదువుకోడానికి న్యూయార్క్ కి పంపాలి

ప్ర) జీవిత కాల లక్ష్యాలు
జ) భారతదేశం , దేవుడు మరియు రాజకీయ నాయకుల మీద చిత్రాలు చెయ్యాలి.

ప్ర) మీకు బాగా నచ్చి సరిగ్గా ఆడని చిత్రం ఏదయినా ఉందా?
జ) నేనింతే

ప్ర) దర్శకత్వం, నటన డాన్స్ , ఫైట్స్ , స్క్రీన్ప్లే – ఏది మీకు నచ్చుతుంది?
జ) పైవేవి కావు రచన అంటే ఇష్టం

ప్ర) ఇష్టమయిన టెక్ బ్రాండ్ ?
జ) ఆపిల్

ప్ర) నేనింతే మీ జీవితంలో ఆధారంగా తెరకెక్కించారా?
జ) లేదు

ప్ర) బద్రి లేదా కెమెరామెన్ గంగతో రాంబాబు ఏదో ఒకటి ఎంచుకోండి
జ) కెమెరామెన్ గంగతో రాంబాబు పవన్ కెరీర్లో ల్యాండ్ మార్క్ గా ఉండిపోతుంది.

అదండి పూరి జగన్నాథ్ తో రాపిడ్ ఫైర్ రౌండ్ మీరు బాగా ఎంజై చేసున్తరనే అనుకుంటున్నాము.

పూరి జగన్ తో బాక్స్ ఆఫీస్ బాబురావు ఇంటర్వ్యూ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు