కెజిఎఫ్ లో రావు రమేష్, ఇట్స్ కన్ఫర్మ్

విలక్షణ నటుడు రావు రమేష్ ప్రెస్టీజియస్ కెజిఎఫ్ 2లో భాగమయ్యారు. ఆయన ఈచిత్రంలో ఓ కీలక రోల్ చేస్తున్నట్లు సమాచారం. ఆయన దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో కూడా రావు రమేష్ కెజిఎఫ్ 2 చిత్రంలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఐతే నేటితో దీనిపై స్పష్టత వచ్చింది. ఐతే కెజిఎఫ్ లో రావు రమేష్ రోల్ పై సందిగ్దత ఉంది. ఆయన నెగెటివ్ షేడ్స్ ఉండే రోల్ చేస్తున్నారా? లేక పాజిటివ్ షేడ్స్ ఉండే సపోర్టింగ్ రోల్ చేస్తున్నారా అనేది తెలియాల్సివుంది.

హోమబుల్ ఫిల్మ్స్ పతాకంపై దర్శకుడు ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ కి సీక్వెల్ గా కెజిఎఫ్ చాప్టర్ 2 తెరకెక్కిస్తున్నారు. కన్నడ హీరో యాష్ నటిస్తున్న ఈ చిత్రంలో ప్రధాన విలన్ గా బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ నటిస్తున్నారు. దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఈ మూవీపై నెలకొనగా ఈఏడాది జులై లో విడుదలయ్యే అవకాశం కలదు. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.

Exit mobile version