‘భీష్మ’ రీమేక్ లో రణ్ వీర్ సింగ్ ?

‘భీష్మ’ రీమేక్ లో రణ్ వీర్ సింగ్ ?

Published on Aug 23, 2020 11:12 PM IST

‘నితిన్’ సూపర్ హిట్ మూవీ ‘భీష్మ’ చిత్రాన్ని హిందీలోకి బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తోన్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చినా.. ఆ తరువాత కరోనా కారణంగా ఈ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. రణబీర్ కపూర్ ఇప్పటికే వరుస సినిమాలకు కమిట్ అవ్వడంతో ఈ సినిమా చేయకపోవచ్చు అని తెలుస్తోంది. కానీ ఈ రీమేక్ చేయటానికి రణ్ వీర్ సింగ్ ఇంట్రస్ట్ గా ఉన్నారట.

పైగా భీష్మ స్క్రిప్ట్ రణ్ వీర్ సింగ్ కి బాగుంటుందనే ఫీల్ రావడంతో నిర్మాతలు, రణ్ వీర్ సింగ్ తోనే ప్లాన్ చేస్తున్నారట. భీష్మ సినిమా తెలుగు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను రాబట్టింది. మొత్తానికి, హీరో నితిన్ కి సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. మరి ఈ సినిమా రణ్ వీర్ సింగ్ కి కూడా సూపర్ హిట్ ని ఇస్తుందేమో చూడాలి.

ఇక ఈ మధ్య ఇక్కడ సూపర్ హిట్టైన సినిమాలని హిందీలోకి రీమేక్ చేస్తున్నారు బాలీవుడ్ నిర్మాతలు. ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ హిందీలో కూడా భారీ హిట్టై వసూళ్ల వర్షం కురిపించడంతో.. తెలుగులో హిట్ అయిన ‘జెర్సీ, ఆర్ఎక్స్100′, ఓ బేబీ’ చిత్రాల రైట్స్ ను ఇప్పటికే బాలీవుడ్ నిర్మాతలు కొనేశారు.

తాజా వార్తలు