ఏప్రిల్ పోటీకి రానా కూడా రెడీ

రానున్న ఏప్రిల్ నెలలో చాలా సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. వాటిలో కొన్ని ఇప్పటికే విడుదల తేదీలను ప్రకటించాయి కూడ. ఎక్కువ చిత్రాలు 2వ తేదీనే ఉన్నాయి. వాటిలో వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’, శేఖర్ కమ్ముల, నాగ చైతన్యల చిత్రం, అనుష్క యొక్క ‘నిశ్శబ్దం’ ఉండగా తాజాగా రానా కూడా వారితో పోటీకి దిగుతున్నారు.

ఆయన సైన్ చేసిన చిత్రాల్లో ‘హాతి మేరే సాతి’ చివరి దశ పనుల్లో ఉండగా మార్చ్ మధ్యలోకి కంప్లీట్ చేసి ఏప్రిల్ 2కి విడుదల చేయాలని నిర్ణయించారు. అస్సాంలోని కజరంగా ప్రాంతంలో మానవ చర్యల మూలాన సుమారు 20 ఏనుగులు ఆశ్రయాన్ని కోల్పోవడం, అవి మళ్ళీ ఎలా కాపాడబడ్డాయి అనేది ఈ సినిమా ప్రధానాంశం. తెలుగు, హిందీ, తమిళంలలో ఒకేసారి విడుదలకానున్న ఈ చిత్రాన్ని ప్రభు సొలొమాన్ డైరెక్ట్ చేస్తున్నారు.

Exit mobile version