‘సూపర్ మ్యాన్‌’ ప్రపంచంలోకి రానా దగ్గుబాటి.. ఏం చేస్తున్నాడంటే..?

‘సూపర్ మ్యాన్‌’ ప్రపంచంలోకి రానా దగ్గుబాటి.. ఏం చేస్తున్నాడంటే..?

Published on Jul 17, 2025 9:00 PM IST

ప్రపంచవ్యాప్తంగా సూపర్ హీరో చిత్రాలలో ‘సూపర్ మ్యాన్’కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. డిస్నీ సంస్థ నుంచి వచ్చిన ‘సూపర్ మ్యాన్’ చిత్రాలకు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. ఇక తాజాగా వచ్చిన ‘సూపర్ మ్యాన్’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. అయితే, ఈ సూపర్ మ్యాన్ కేవలం సినిమాల్లోనే కాకుండా కామిక్స్ రూపంలో కూడా విశేషమైన ఆదరణ పొందుతున్నాడు.

డిస్నీ కామిక్స్ వరల్డ్‌వైడ్‌గా ఫేమస్ కావడానికి ఈ సూపర్ మ్యాన్ కారణమని చెప్పాలి. అయితే, ఇలాంటి సూపర్ మ్యాన్ కోసం మన టాలీవుడు నటుడు కమ్ నిర్మాత రానా దగ్గుబాటి కథను అందిస్తున్నాడు. డిస్నీ కామిక్స్‌లో భాగంగా రానున్న ‘టు బి ఏ హీరో’ అనే కథలో రానా దగ్గుబాటి కూడా ఇన్వాల్వ్ అవుతున్నాడు. ప్రముఖ కామిక్ బుక్ ఆర్టిస్ట్ సిడ్ కొటియాన్‌తో చేతులు కలిపిన రానా, ‘టు బి ఏ హీరో’కు కథను అందిస్తున్నాడు.

ఇక ఈ కథలో సూపర్ మ్యాన్ ఒక వస్తువును అన్వేషిస్తూ ఇండియాకు చేరుకుంటాడు. అయితే, ఇక్కడ ఒక అమ్మాయి చరిత్ర గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఉంటుంది. కాగా, ఓ కుర్రాడు ఒక సాయం కోరి వారి వద్దకు చేరుకోవడంతో కథ మలుపు తిరగనుంది. ఇక్కడి ఓ పురాతన ఆలయాన్ని, అందులోని విగ్రహాలను ధ్వంసం కాకుండా సూపర్ మ్యాన్ ఎలా కాపాడుతాడు అనేది ఈ కామిక్ కథ.

ఇలా వరల్డ్ ఫేమస్ అయిన సూపర్ మ్యాన్ కోసం కథను అందించిన రానా దగ్గుబాటి ప్రస్తుతం మరోసారి వార్తల్లో నిలిచాడు. రానాకు కామిక్స్ అంటే ఎంతో ఇష్టమని ఆయన పలుమార్లు చెప్పుకొచ్చాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు