రానా ‘అరణ్య’ ఫస్ట్ లుక్ మరియు రిలీజ్ డేట్ వచ్చేశాయి

రానా దగ్గుబాటి హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ హాథీ మేరే సాథీ. తెలుగులో ఈ చిత్రం అరణ్య పేరుతో విదులకానుంది. కాగా నేడు ఈ చిత్ర విడుదల తేదీ ప్రకటించారు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ్ మరియు హిందీలో ఏప్రిల్ 2న వేసవి కానుకగా విడుదల కానుంది. ఇక రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ పోస్టర్ లో రానా కంప్లీట్ డిఫరెంట్ గా ఉన్నాడు. అడవిలో ఏనుగులను మచ్చిక చేసుకోని వాటితో సావాసం చేసే అడవి తెగకి చెందిన వ్యక్తిగా ఆయన లుక్ ఉంది.

అరణ్య మూవీ మానవుల స్వార్థం కోసం అడవులను ఆక్రమించడం, సహజ వనరులను నాశనం చేయడం వలన అడవి జంతువుల మనుగడకు ముప్పు వాటిల్లుతుంది. మనిషి స్వార్ధం వలన ఏనుగులు మనుగడ కోల్పోయే పరిస్థితి వస్తే దానిని ధైర్యంగా ఎదిరించిన వ్యక్తి కథగా అరణ్య తెరకెక్కింది. దర్శకుడు ప్రభు సాల్మన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా ఎరోస్ ఇంటర్నేషనల్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విష్ణు విశాల్, జోయా హుస్సేన్ మరియు శ్రియా పిలగోన్కర్ ఇతర ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

Exit mobile version