పవన్ సినిమా గురించి రానా ఏమ్మన్నారంటే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాక వరుస సినిమాలకు సైన్ చేశారు. ఇప్పటికే ‘వకీల్ సాబ్’ చివరి దశలో ఉండగా ఇంకొన్ని రోజుల్లో మొత్తం షూటింగ్ ముగియనుంది. ఈ సినిమా తర్వాత ఆయన మలయాళ హిట్ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్ స్టార్ట్ చేస్తారు. ఈ చిత్రాన్ని సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేయనున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. ఈ చిత్రం కోసం పవన్ సుమారు 40 రోజులు డేట్స్ కేటాయించారట.

ఇందులో రెండవ ప్రధాన పాత్ర కోసం స్టార్ నటుడు రానాను అప్రోచ్ అయినట్టు మొదట్లో వార్తలొచ్చాయి కానీ ఎక్కడా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. తాజాగా ఈ విషయం మీద స్పందించిన రానా సినిమా కోసం తనను సంప్రదించిన మాట నిజమే. కానీ ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు. నినాయం తీసుకోవాల్సి ఉంది. అయితే ఆ పాత్ర మాత్రం నాకు బాగా నచ్చింది అంటూ చెప్పుకొచ్చారు. దీన్నిబట్టి రానా వైపు నుండి కన్ఫర్మేషన్ అందాల్సి ఉందని, అన్నీ కుదిరితే ఆయనే సినిమాలో నటిస్తారని అర్థమవుతోంది. ఇకపోతే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది.

Exit mobile version