నాయక్ కలకత్తా షెడ్యూల్ పూర్తి

నాయక్ కలకత్తా షెడ్యూల్ పూర్తి

Published on Oct 23, 2012 4:47 PM IST


రామ్ చరణ్ మొదటిసారి ద్విపాత్రాభినయంలో నటిస్తున్న సినిమా ‘నాయక్’. ఇటీవలే కలకత్తా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా షెడ్యూల్ పూర్తయింది. కలకత్తా లోని మల్లిక్ ఘాట్ ఫ్లవర్ మార్కెట్, చోటే లాల్ ఘాట్ ప్రాంతాల్లో షూటింగ్ జరిపారు. కలకత్తాలో 15 రోజుల పాటు ఈ షెడ్యూల్ షూటింగ్ జరిపారు. ఈ షెడ్యూల్లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించినట్లు సమాచారం. నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాదులో చేయనున్నారు. నవంబర్ నెలాఖరు వరకు షూటింగ్ పూర్తి చేసి డిసెంబర్ నెలలో ఆడియో విడుదల చేసి సంక్రాంతి కానుకగా జనవరి 9 సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్ మరియు అమలా పాల్ నటిస్తున్న ఈ సినిమాకి వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు.

తాజా వార్తలు