ప్రస్తుతం కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నటిస్తున్న మనవాడి నెక్స్ట్ ఫిలిం వివరాలు వచ్చేసాయి. ముందుగా తన తదుపరి సినిమా బోయపాటి తో ఫుల్ యాక్షన్ ప్యాక్ మూవీ ని తీద్దాం అనుకున్నాడని సమాచారం. దీనికి రూలర్ అనే టైటిల్ ని కూడా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కాకుండా శ్రీను వైట్ల దర్శకత్వంలో నటించడానికి పచ్చ జెండా ఊపాడని సమాచారం. ఈ సినిమా చెర్రి ఇమేజ్ కు ఏ మాత్రం తగ్గకుండా, శ్రీను మార్క్ కామెడి కొంచం కూడా మిస్ అవ్వకుండా వుంటుందని సమాచారం
ఈ సినిమాకు ఒక భారీ నిర్మాత పెట్టుబడి పెట్టనున్నాడని సమాచారం. ప్రస్తుతం శ్రీను వైట్ల ఆగడు సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా 2014 చివర్లో మొదలుకానుంది. ఇంకా ఈ సినిమాపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు