వీరే నా కొండంత బలం..చరణ్ వాత్సల్యం!

వీరే నా కొండంత బలం..చరణ్ వాత్సల్యం!

Published on Feb 20, 2021 12:00 PM IST

మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ కోసం తెలుగు ప్రేక్షకులకు కొత్తగా రాసి చెప్పనవసరం లేదు. చిరు స్థాపించిన ప్రస్థానం కోసం, చరిత్రే చెబుతుంది. మరి అలా చిరు స్థాపించిన మెగా లెగసీకు తగ్గ తనయుడిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దానిని కొనసాగిస్తూ ఇద్దరూ ఇండియన్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

మరి ఇప్పుడు రామ్ చరణ్ తనకు జన్మనిచ్చిన ఇద్దరు తల్లిదండ్రులే నాకు కొండంత బలం వారి పట్ల తన వాత్సల్యాన్ని కనబరిచాడు. నేటితో కొణిదెల చిరంజీవి – సురేఖ దంపతుల వివాహం జరిగి 42 ఏళ్ళు పూర్తి కావడంతో వారిద్దరి ఫోటోను సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసి చరణ్ ఇద్దరికీ మర్యాపూర్వకంగా తన శుభాకాంక్షలను తెలిపి చిరును ట్యాగ్ చేసాడు.

దీనితో మెగా ఫాలోవర్స్ కూడా తమ శుభాకాంక్షలను సోషల్ మీడియాలో ప్రేమతో తెలియజేస్తున్నారు. ప్రస్తుతం చరణ్ చిరుతో “ఆచార్య” సినిమాలో నటిస్తుండగా దర్శక ధీరుడు రాజమౌళితో “రౌద్రం రణం రుధిరం” అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు