‘పెద్ది’లో గ్లోబల్ స్టార్ మరో క్రేజీ లుక్.. మేకర్స్ సాలిడ్ అప్డేట్!

‘పెద్ది’లో గ్లోబల్ స్టార్ మరో క్రేజీ లుక్.. మేకర్స్ సాలిడ్ అప్డేట్!

Published on Aug 18, 2025 12:00 AM IST

peddi

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా కలయికలో చేస్తున్న అవైటెడ్ మాస్ చిత్రమే “పెద్ది”. ఈ సినిమా కోసం ఆల్రెడీ రామ్ చరణ్ ఒక ఊర మాస్ లుక్ ని సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ లుక్ కాకుండా మరో క్రేజీ లుక్ కూడా ఉండేలా అనిపిస్తుంది.

ఇది వరకే ప్రిపేర్ చేసిన లుక్ కాకుండా రామ్ చరణ్ మరో మేకోవర్ కి సిద్ధం అవుతున్నట్టు మేకర్స్ సాలిడ్ అప్డేట్ అందించారు. పెద్ది నుంచి పవర్ ప్యాకెడ్ లుక్స్ సిద్ధంగా ఉన్నాయి ఫేమస్ హెయిర్ స్టైలిస్ట్ అలీ హకీమ్ తో విజువల్స్ మంచి ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్నాయి. దీనితో ఈ క్లిప్ వైరల్ గా మారింది. బుచ్చిబాబు అయితే రాకింగ్ ఫైనల్ లుక్స్ ఫైనల్ చేస్తున్నట్టు తెలిపారు. మరి పెద్ది లో గ్లోబల్ స్టార్ మేకోవర్ ఎలా ఉండబోతుందో చూడాల్సిందే.

తాజా వార్తలు