నైజాంలో వర్కింగ్ డేకి కూలీ, వార్ 2 ఇక్కట్లు!

నైజాంలో వర్కింగ్ డేకి కూలీ, వార్ 2 ఇక్కట్లు!

Published on Aug 19, 2025 9:05 PM IST

coolie

లేటెస్ట్ గా పాన్ ఇండియా లెవెల్లో మంచి అంచనాలు నడుమ రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ అలాగే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ల వార్ 2 ల కోసం తెలిసిందే. ఇంట్రెస్టింగ్ గా ఈ రెండు సినిమాలకి కూడా యునానిమస్ పాజిటివ్ టాక్ రాలేదు. అయినప్పటికీ మొదటి వారాంతం అయ్యేసరికి మంచి వసూళ్లు ఈ సినిమాలు అందుకున్నాయి.

కానీ అసలు టెస్ట్ నిన్న వర్కింగ్ డే సోమవారం నుంచి మొదలైంది. మరి నైజాం మార్కెట్ లో అయితే రెండు సినిమాలకి దారుణంగా వసూళ్లు పడిపోయినట్టు పి ఆర్ లెక్కలు చెబుతున్నాయి.. కూలీ సినిమా 37 లక్షల షేర్ (జీఎస్టీ కలిపి) అందుకుంటే వార్ 2 మాత్రం కేవలం 12 లక్షల షేర్ ని మాత్రమే అందుకుంది అట. దీనితో రెండు సినిమాలు కూడా ఇపుడు ఇక్కట్లు పడుతున్నాయని చెప్పక తప్పదు.

తాజా వార్తలు