నందమూరి వారి ఇంట విషాదం!

నందమూరి వారి ఇంట విషాదం!

Published on Aug 19, 2025 12:09 PM IST

ప్రస్తుతం వెండితెరపై నందమూరి హీరోలు తమ సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరి కుటుంబం ఇంట ఓ తీరని విషాదం చోటు చేసుకున్న వార్త షాకింగ్ గా మారింది. సీనియర్ ఎన్టీఆర్ వారసుల్లో ఒకరైన నందమూరి జయకృష్ణ సతీమణి నందమూరి శ్రీమతి పద్మజ కన్ను మూశారనే వార్త ఇపుడు వారి ఇంట తీవ్ర విషాదాన్ని కలుగజేసింది.

ఆమె నందమూరి తారక రామా రావు, శ్రీమతి బసవరామ తారకంల పెద్ద కోడలు కాగా ఆమె గత కొన్ని రోజులు నుంచి అనారోగ్యంతో ఉన్నారట. అయితే శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది ఎదురు కావడం తో ఈరోజు తెల్లవారుజామున హాస్పిటల్ లో చేర్పించారు. కానీ పరిస్థితి చేయి దాటడంతో ఈ తెల్లవారు జామున ఆమె మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. ఈ వార్త తెలిసి విజయవాడ నుంచి ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు , ఢిల్లీ నుంచి దగ్గుబాటి పురందేశ్వరి బయలుదేరారట. మరి నందమూరి పద్మజ గారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మా 123తెలుగు యూనిట్ ఆకాంక్షిస్తుంది. ఓం శాంతి.

తాజా వార్తలు