8 వసంతాలు తర్వాత ప్రభాస్, అనుష్క ట్రీట్!?

8 వసంతాలు తర్వాత ప్రభాస్, అనుష్క ట్రీట్!?

Published on Aug 19, 2025 1:00 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అలాగే నటి అనుష్కల జంటకి మన తెలుగు ఆడియెన్స్ లో ఒక సెపరేట్ క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇలా వారి కలయికలో వచ్చిన సినిమాలు అన్నిటికీ మంచి ట్రాక్ రికార్డు ఉంది. అయితే తామిద్దరూ కలిసి చివరిగా కనిపించిన చిత్రం “బాహుబలి 2”. ఆ తర్వాత ఇద్దరు కలిసి స్క్రీన్స్ షేర్ చేసుకోవడం కానీ బయట ఏదన్నా ఈవెంట్ లో అయినా కలిసిన దాఖలాలు లేవు.

కానీ మళ్ళీ 8 వసంతాలు తర్వాత ఇద్దరు కలిసి కనిపించనున్నట్టు తెలుస్తుంది. అయితే ఇది ఓ సినిమా కోసమే కానీ నటించేందుకు కాదు. తమ కలయికలో వచ్చిన బాహుబలి సినిమా కలిపి రిలీజ్ చేస్తున్న బాహుబలి ది ఎపిక్ ప్రమోషన్స్ లో కనిపించే ఛాన్స్ ఉన్నట్టుగా వినిపిస్తుంది. దీనితో చాలా కాలం నుంచి మిస్ అవుతున్న ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ గ్యారెంటీ అని చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ ఎప్పటికి జరుగుతాయో కాలమే నిర్ణయించాలి.

తాజా వార్తలు