ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రస్తుతం ప్రేక్షకుల నాడి ఎలా ఉందనే విషయంపై ఎవరూ కూడా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఆడియన్స్‌కు ఏ సినిమా నచ్చుతుందా.. ఎలాంటి సినిమాకు వారు నీరాజనం పడతారా అనేది ఎవరి ఊహలకు అందని ప్రశ్నగా మారింది. దీనికి ఉదాహరణగా ఈ ఏడాదిలో రిలీజ్ అయిన సినిమాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
ఈ ఏడాది ప్రారంభంలో టాలీవుడ్‌లో ఒకే బ్యానర్ నుంచి ఓ పెద్ద సినిమా, ఓ చిన్న సినిమా వచ్చాయి. దిల్ రాజు ప్రొడక్షన్ హౌజ్ నుంచి వచ్చిన ‘గేమ్ ఛేంజర్’ బాక్సాఫీస్ దగ్గర ఓ పీడకల గా మారింది. అయితే, ఇదే ప్రొడక్షన్ హౌజ్ నుంచి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్‌గా మారింది. ఈ సినిమాలకు ప్రేక్షకులు ఇచ్చిన తీర్పు హాట్ టాపిక్‌గా మారింది.
అయితే, ఇప్పుడు ఇదే తరహా సీన్ బాలీవుడ్‌లోనూ రిపీట్ అయింది. యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్ నుంచి వచ్చిన ‘సయారా’ చిత్రం కళ్లుచెదిరే వసూళ్లతో దుమ్ము లేపింది. ఇక ఇదే బ్యానర్ నుంచి వచ్చిన ప్రెస్టీజియస్ చిత్రం ‘వార్ 2’ ప్రేక్షకులను అలరించడంలో పెయిల్ అయ్యాంది. మరి నిజంగానే ఆడియన్స్ పల్స్ మారిందా.. లేక సినిమాలు తీసే మేకర్స్ తమ పంథా మార్చుకోవాలా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.