మన టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇప్పుడు తన కెరీర్ గ్రాఫ్ ను మరింత స్థాయిలో పెంచుకున్నాడు. మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్ తో తీసిన “ఇస్మార్ట్ శంకర్” తో మాస్ లో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ నటుడు ఇప్పుడు దాన్ని అలా కొనసాగించడానికి తన వంతు కృషి చేస్తున్నాడు.
మరి అలాగే “రెడ్” లాంటి మాస్ యాక్షన్ థ్రిల్లర్ తర్వాత కోలీవుడ్ సెన్సేషనల్ దర్శకుడు ఎన్ లింగుసామితో టై అప్ అయ్యాడు. లింగుసామి మాస్ చిత్రాలకు మన తెలుగులో కూడా మంచి ఆదరణ లభించింది. దీనితో ఈ కాంబో నుంచి ఇప్పుడు అధికారిక అనౌన్స్మెంట్ వచ్చేసింది.
మరి అలాగే ఈ చిత్రాన్ని తెలుగు మరియు తమిళ్ లో ఏక కాలంలో బై లాంగువల్ చిత్రంగా దీనిని తెరకెక్కిస్తున్నారు. అలాగే ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కు గాను ఎస్ ఎస్ స్క్రీన్స్ బ్యానర్ లో శ్రీనివాస చిట్టూరి నిర్మాణం వహిస్తున్నారు. మరి ఈ ప్రాజెక్ట్ నుంచి మరింత సమాచారం రావాల్సి ఉంది.
My Next with @ramsayz brother & #SrinivasaaChitturi sir @SS_Screens#RaPo19 #SSS6 pic.twitter.com/SBII8F5yfA
— Lingusamy (@dirlingusamy) February 18, 2021