రజనీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన “శివాజీ” చిత్రం ఈ ఏడాది 3డిలో రానుంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం “మగధీర” చిత్రం విడుదల ముందు వరకు దక్షణ భారతదేశంలో అతి పెద్ద సినిమాగా పేరొందింది. ఈ చిత్రం ఇప్పటికీ రజనీకాంత్ కెరీర్లో వసూళ్ళ విషయంలో “రోబో” తరువాత రెండవ స్థానంలో ఉంది. ఈ చిత్రాన్ని 3డికి మార్చడంలో రజనీకాంత్ చాలా సంతోషంగా ఉన్నారని తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం మూడు గంటలున్న ఈ చిత్రాన్ని 2 గంటల 17 నిమిషాలకు కుదించారు. ఈ చిత్రంలో శ్రియ మరియు సుమన్ లు ప్రధాన పాత్రలు పోషించారు. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా కే వి ఆనంద్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రం 2007లో విడుదలై భారీ విజయం సాదించింది.